Nara Lokesh: పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు, పోలీసులు మాత్రమే మిగులుతారు: నారా లోకేశ్

lokesh slams ycp
  • సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరమా
  • టీడీపీ కార్యకర్త కోన వెంకటరావుని వేధించారు
  • బలవన్మరణానికి పాల్పడేలా చేశారన్న లోకేశ్  
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, పోలీసుల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిప‌డ్డారు. ''ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా? అనే అనుమానాలున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావుని వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన వైసీపీ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారు. 

మా టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. వెంకటరావు కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.

సోషల్ మీడియా పోస్ట్ ల పేరుతో టీడీపీ కార్యకర్తలపై ఇకనైనా వేధింపులు ఆపాలి. చట్టాలని గౌరవిస్తున్నామని... పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే తిరుగుబాటు తప్పదు' అని నారా లోకేశ్ హెచ్చ‌రించారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News