TDP: ఇదెక్కడి విడ్డూరం.. బొత్స కుమారుడి రిసెప్షన్ కోసం శాసనసభకు సెలవా?: టీడీపీ

ap govt announce leave to assembly session on wednesday tdp shocked
  • వైసీపీ ప్రభుత్వం వింతగా వ్యవహరిస్తోంది
  • నేతల ఇళ్లలో జరిగే పండుగలు, పబ్బాలకు కూడా సెలవులేంటి?
  • తీవ్రంగా ఖండించిన టీడీపీ శాసనసభాపక్షం
వైసీపీ ప్రభుత్వం వింతగా వ్యవహరిస్తోందని, మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశాలకే సెలవు ప్రకటించడం ఏంటని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ.. నేతల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలకు కూడా సభకు సెలవులు ఇస్తారా? అని ప్రశ్నించారు.

బీఏసీ సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు, ఇతర నేతల దృష్టికి అచ్చెన్నాయుడు తీసుకెళ్లారు. నేతల ఇళ్లలో జరిగే వేడుకలకు శాసనసభకు సెలవులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు శాసనసభాపక్షం పేర్కొంది. మరోవైపు సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు  ట్వీట్ చేస్తూ.. గవర్నర్‌ను ఎలా గౌరవించాలో తమకు చెప్పాల్సిన పనిలేదని అన్నారు. వయసులో పెద్దవారైన గవర్నర్‌ను గౌరవించాలని జగన్ చెబుతున్నారని.. మరి వయసులో పెద్దవారు, తండ్రి తర్వాత తండ్రి లాంటి బాబాయికి ఆయనిచ్చిన గౌరవం ఏపాటిదో అందరికీ తెలుసని ఆ ట్వీట్‌లో విమర్శించారు.
TDP
Jagan
YSRCP
AP Assembly Session

More Telugu News