Narendra Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడితో 35 నిమిషాల పాటు మాట్లాడిన ప్ర‌ధాని మోదీ

Modi spoke on phone to President Volodymyr Zelensky of Ukraine
  • ఉక్రెయిన్ నుంచి భార‌త పౌరుల త‌ర‌లింపులో సాయం ప‌ట్ల థ్యాంక్స్ చెప్పిన మోదీ
  • నిరంత‌రం స‌హ‌కారం ఉండాల‌ని విన‌తి
  • ఉక్రెయిన్‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై మోదీకి జెలెన్ స్కీ వివ‌ర‌ణ‌
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాష‌ణ కొన‌సాగింది. ఉక్రెయిన్ నుంచి భార‌త పౌరుల త‌ర‌లింపులో సాయం ప‌ట్ల జెలెన్ స్కీకి మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

ఇప్ప‌టికీ కొంద‌రు భార‌త పౌరులు ఉక్రెయిన్‌లోనే ఉండ‌డంతో భార‌త పౌరుల త‌ర‌లింపులో నిరంత‌రం స‌హ‌కారం ఉండాల‌ని మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై మోదీకి జెలెన్ స్కీ వివ‌రించారు. ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య ప్ర‌త‌క్ష చ‌ర్చ‌లు జ‌రుగుతోన్న తీరును మోదీ అభినందించారు. దౌత్య మార్గాల్లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న చెప్పారని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.
Narendra Modi
Volodymyr Zelensky
Ukraine
Russia

More Telugu News