Bandi Sanjay: బీజేపీకి అవకాశమివ్వండి... హైదరాబాద్ ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేస్తాం: బండి సంజయ్

Bandi Sanjay comments on Hyderabad lok sabha constituency
  • హైదరాబాద్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు
  • హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలవడమే లక్ష్యమని వెల్లడి
  • ఎంఐఎం గూండాల నుంచి విముక్తి కలిగిస్తామని వ్యాఖ్యలు
  • చంపాపేటలో బీజేపీ కార్యకర్తలతో సంజయ్ భేటీ
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్ అంశం కేంద్రబిందువుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలవడమే బీజేపీ లక్ష్యం అని స్పష్టం చేశారు. బీజేపీకి అవకాశమిస్తే హైదరాబాద్ ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేస్తామని వెల్లడించారు. పాతబస్తీలో హిందువుల ఘర్ వాపసీ కార్యక్రమం షురూ చేస్తామని చెప్పారు. ఎంఐఎం గూండాల నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని అన్నారు. పాతబస్తీలో గణేశ్ నిమజ్జనానికి అసదుద్దీన్ ఒవైసీ, కేసీఆర్ ఎందుకు హాజరు కారని ప్రశ్నించారు. 

ముస్లిం మహిళలు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఫత్వా జారీ చేసే స్థితికి ఎంఐఎం వచ్చిందని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే దారుస్సలాంను ఆక్రమిస్తామని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని తెలంగాణ ఐకాన్ గా చేస్తామని వివరించారు. చంపాపేటలో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay
Hyderabad
Lok Sabha
BJP
MIM
KCR
Telangana

More Telugu News