V Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెక్యూరిటీ బృందంలో ఎవరెవరు ఉంటారంటే...!

High security for Telangana minister Srinivas Goud
  • శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర
  • ఇటీవల భగ్నం చేసిన సైబరాబాద్ పోలీసులు
  • మంత్రికి భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
  • గ్రేహౌండ్ సిబ్బందితో భద్రత
  • మంత్రి కాన్వాయ్ లోకి అదనంగా రెండు వాహనాలు
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భద్రత పెంచుతున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. భారీ ఏర్పాట్లలో భాగంగా శ్రీనివాస్ గౌడ్ కు 20 మంది పోలీసులు, 10 మంది సిటీ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది, ఆరుగురు ఇంటెలిజెన్స్ అధికారులు, నలుగురు గ్రేహౌండ్స్ కమాండోలతో భద్రత కల్పిస్తారు. 

తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత శ్రీనివాస్ గౌడ్ మాత్రమే గ్రేహౌండ్స్ కమాండోల భద్రత పొందుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ భద్రతాబృందంలోని పోలీసులకు ఎం44 ఆయుధాలు అందించనున్నారు. అంతేకాదు, మంత్రి కాన్వాయ్ లోకి అదనంగా మరో రెండు వాహనాలను పెంచారు.
V Srinivas Goud
High Security
Murder Conspiracy
TRS
Telangana

More Telugu News