టికెట్ కొని పుణె మెట్రో రైలు ఎక్కిన ప్రధాని మోదీ
- పుణె మెట్రోరైలు ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం
- అనంతరం గార్వేర్ నుంచి ఆనంద్ నగర్ స్టేషన్ వరకు ప్రయాణం
- ప్రయాణ సమయంలో విద్యార్థులతో ముచ్చట్లు
పుణె మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం నిడివి 32.2 కిలోమీటర్లు కాగా, తొలి దశ కింద 12 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. వనజ్ నుంచి గార్వేర్ కాలేజ్ మెట్రో స్టేషన్ వరకు.. అలాగే, పీసీఎంసీ నుంచి ఫుగెవాడి మెట్రో స్టేషన్ వరకు రెండు మార్గాల్లో మెట్రో రైళ్లు నడవనున్నాయి.
ప్రధాని పర్యటన గురించి ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. ‘పుణె ప్రజలకు అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇది భరోసానిస్తుంది’అంటూ ట్వీట్ చేసింది. పర్యటన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.