Tollywood: ప్రేమించుకున్నాం.. కెరీర్ కోసం విడిపోయాం: తెలుగు హీరోయిన్ బిందు మాధవి

We Loved Each Other But Left Alone For Careers Says Bindu Madhavi
  • తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని వెల్లడి
  • అతడితో ప్రేమ ఎప్పటికీ స్పెషలేనని కామెంట్
  • అతడిప్పుడు పెళ్లి చేసుకున్నాడని చెప్పిన హీరోయిన్
‘ఆవకాయ బిర్యానీ’, ‘బంపర్ ఆఫర్’, ‘రామరామ కృష్ణకృష్ణ’ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన తెలుగు హీరోయిన్ బిందు మాధవి. ఆ తర్వాత ఇక్కడ మంచి ఆఫర్లు లేకపోవడంతో ప్రస్తుతం తమిళంలో నటిస్తోంది. అక్కడ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా, ఓటీటీ స్పెషల్ బిగ్ బాస్ లో ఆమె ఒక పార్టిసిపెంట్. 

తమ వ్యక్తిగత వివరాలను హౌస్ మేట్స్ తో పంచుకోవాలంటూ బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో ఆమె తన జీవితంలో జరిగిన ప్రేమ వ్యవహారం గురంచి చెప్పుకొచ్చింది. కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించానని, కానీ, ఆ తర్వాత విడిపోయామని తెలిపింది. ‘‘కెరీర్ కోసమే మేం దూరమయ్యాం. ఉన్నత చదువుల కోసం అతడు అమెరికా వెళ్లిపోయాడు. నేను సినిమాల మీద మక్కువతో ఇక్కడే ఉండిపోయా. అతడికి పెళ్లి కూడా అయిపోయింది. అతడితో ప్రేమ ఎప్పటికీ నాకు స్పెషలే’’ అని బిందుమాధవి చెప్పింది. 

బ్రేకప్ సమయంలో తాను తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని పేర్కొంది. అలాంటి సమయంలోనే తమిళ బిగ్ బాస్ లో కంటెస్ట్ చేశానని, ఆ తర్వాత కొన్ని రోజులకే డిప్రెషన్ నుంచి బయటపడ్డానని వెల్లడించింది. ఇప్పుడు తెలుగులోనూ వచ్చిన అవకాశాలతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం వచ్చిందని ఆమె తెలిపింది.
Tollywood
Kollywood
Bindu Madhavi
Bigg Boss

More Telugu News