India: భారత్ ప్రయోజనాల కోసమైనా మోదీ.. రష్యా యుద్దాన్ని అడ్డుకోవాలి: ఉక్రెయిన్

In Indias best interests Ukraine asks PM Modi to urge Russian Prez Putin to stop war
  • ఉక్రెయిన్ నుంచి భారత్ కు భారీగా వ్యవసాయ ఎగుమతులు
  • యుద్ధం కొనసాగితే కొత్త పంటల సాగు సాధ్యపడదు
  • అందుకే భారత్ సహా ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలి
  • ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి పిలుపు
తమ దేశంపై రష్యా దండయాత్రను అడ్డుకోవాలంటూ ఉక్రెయిన్ మరోసారి ప్రపంచ దేశాలను కోరింది. ముఖ్యంగా భారత్ తన ప్రయోజనాల కోసమైనా ఈ విషయంలో జోక్యం చేసుకుని యుద్ధాన్ని అడ్డుకోవాలని అభ్యర్థించింది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఈ మేరకు టెలివిజన్ చానల్ లో మాట్లాడారు.

ముఖ్యంగా భారత్ ను ప్రస్తావనకు తీసుకొచ్చారు. ‘‘ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా వినియోగించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే నూతన పంటల సాగు సాధ్యపడదు. కనుక అంతర్జాతీయ, భారత ఆహార భద్రత కోసం అయినా యుద్ధాన్ని ఆపాలి. రష్యాతో ప్రత్యేక సంబంధాలు కలిగిన దేశాలు ‘ అందరి ప్రయోజనాలకు ఈ యుద్ధం వ్యతిరేకం’అని పుతిన్ కు నచ్చజెప్పాలి’’అని కులేబా కోరారు. యుద్ధాన్ని ఆపే దిశగా భారత పౌరులు కూడా ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. 

ఉక్రెయిన్ లోని విదేశీ విద్యార్థుల విషయంలో రష్యా సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నట్టు కులేబా ఆరోపించారు. రష్యా ఈ అంశాన్ని తారుమారు చేయకపోతే.. విదేశీ విద్యార్థులు క్షేమంగా తరలిపోవడానికి వీలుంటుందన్నారు. ‘‘భారత్, చైనా, నైజీరియా దేశాలకు నా వినతి ఏమిటంటే కాల్పులు ఆపి తమ పౌరులు వెళ్లేందుకు సహకరించాలంటూ రష్యాని కోరాలి’’అని కులేబా పేర్కొన్నారు. 

India
Ukraine
urged
stop war
russia

More Telugu News