teacher: టీచ‌ర్ కొట్టాడ‌ని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన బుడ్డోడు.. వీడియో ఇదిగో

Third class student files complaint against class teacher
  • మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఘ‌ట‌న
  • మూడో తరగతి చదువుతున్న అనిల్ అనే బాలుడు 
  • బాలుడి స్కూల్‌కి వెళ్లి ఎస్సై రమాదేవి విచార‌ణ‌
టీచ‌ర్ కొట్టాడ‌ని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడో బుడ్డోడు. ఇందుకు సంబంధించిన‌ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మూడో తరగతి చదువుతున్న అనిల్ అనే బాలుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఎందుకు వ‌చ్చావంటూ పోలీసులు అడిగారు. 

దీంతో టీచ‌ర్ త‌న‌ను కొట్టాడ‌ని చెప్పాడు. త‌నను కొట్టిన టీచ‌ర్‌ను అరెస్టు చేసి, కొట్టాల‌ని అన్నాడు. తాను ధ్యానం చేసుకుంటుంటే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి టీచ‌ర్ కొట్టాడ‌ని చెప్పాడు. దీంతో ఎస్సై రమాదేవి ఆ బాలుడి స్కూల్‌కు వెళ్లి విచారణ జ‌రిపారు. పిల్ల‌ల‌ను కొట్టకూడ‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు.  


            
teacher

More Telugu News