హై ఓల్టేజీ మ్యాచ్!.. భారత్, పాక్ జట్ల పోరు రేపే!
- న్యూజిలాండ్ గడ్డపై మహిళల వన్డే వరల్డ్ కప్
- ఆసక్తి రేకెత్తిస్తున్న దాయాదుల మధ్య పోరు
- ట్రాక్ రికార్డు చూస్తే..భారతే ఫేవరెట్
ఇప్పుడు మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లు ముగియగా.. ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. హోరాహోరీగా సాగనున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
ఇదిలా ఉంటే..పురుషుల క్రికెట్ లో మాదిరిగానే మహిళల క్రికెట్‌లోనూ పాకిస్థాన్‌పై భారత జట్టుకు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు పాకిస్థాన్‌పై 10 వన్డేల్లో భారత మహిళల జట్టు గెలిచింది. 11 సార్లు జరిగిన టీ20 మ్యాచుల్లోనూ ఒక్కసారి మాత్రమే ఇండియా ఓడిపోయింది. రేపటి మ్యాచ్‌లోనూ ఇండియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.