Pattabhi: రైతులు 807 రోజులుగా ఉద్యమం చేస్తే సజ్జలకు వెకిలిచేష్టగా కనిపించిందా?: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి

Pattabhi fires on Sajjala over Amaravathi issue
  • సజ్జల నోరు పారేసుకుంటున్నారన్న పట్టాభి 
  • అధికారమదంతో విర్రవీగుతున్నారంటూ వ్యాఖ్య 
  •  307 పేజీల హైకోర్టు తీర్పును ఓసారి చదవాలని హితవు 
ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. రాజధానిని తరలించే హక్కు అసెంబ్లీకి ఉండదని హైకోర్టు తీర్పు చెప్పిందని పట్టాభి వివరించారు. 

రాజధాని అమరావతిపై సజ్జల ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు 807 రోజులుగా ఉద్యమం చేస్తే సజ్జలకు వెకిలిచేష్టగా కనపడిందా? అంటూ మండిపడ్డారు. అధికారమదంతో విర్రవీగుతున్న సజ్జల కొవ్వెక్కి మాట్లాడుతున్నారని పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై మాట్లాడే ముందు సజ్జల 307 పేజీల హైకోర్టు తీర్పును ఓసారి చదవాలని హితవు పలికారు.
Pattabhi
Sajjala Ramakrishna Reddy
Amaravati
AP High Court
TDP
YSRCP
AP Capital
Andhra Pradesh

More Telugu News