Team India: మొహాలీ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట... టీమిండియాదే పైచేయి

Team India takes advantage on Sri Lanka in Mohali
  • మొహాలీలో టీమిండియా, శ్రీలంక తొలిటెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 574-8 వద్ద డిక్లేర్ చేసిన భారత్
  • లంక టాపార్డర్ ను దెబ్బతీసిన టీమిండియా బౌలర్లు
  • ఆట చివరికి 4 వికెట్లకు 108 పరుగులు చేసిన లంక
మొహాలీ టెస్టులో భారత్ తన ప్రత్యర్థి శ్రీలంకపై ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ ను 574-8 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా... ఆపై శ్రీలంక టాపార్డర్ ను దెబ్బతీసింది. ఆట చివరికి శ్రీలంక జట్టు 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. పత్తుమ్ నిస్సాంక 26, చరిత్ అసలంక 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 2, బుమ్రా 1, జడేజా ఒక వికెట్ తీశారు. 

కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు శ్రీలంక ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది. లంక బ్యాటింగ్ తీరు చూస్తుంటే టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం కనిపించడంలేదనిపిస్తోంది. అదే జరిగితే, కోహ్లీ తన 100వ టెస్టులో సెంచరీ ఆశలు వదులుకోవాల్సిందే. తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ 45 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Team India
Sri Lanka
1st Test
Mohali

More Telugu News