Pinakapani: విరసం నేత పినాకపాణి నివాసంలో ఎన్‌ఐఏ సోదాలు

NIA searches in Virasam Pinakapani
  • కర్నూలు లోని పినాకపాణి నివాసంలో సోదాలు
  • గత నెలలో కొచ్చిలో పినాకపాణిపై కేసు నమోదు
  • గత ఏడాది కూడా ఆయన ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. కర్నూలులోని శ్రీలక్ష్మీ నగర్ లో ఉన్న పినాకపాణి నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత నెలలో కొచ్చిలో ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఆయనను ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఆయన ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. అప్పట్లో కేరళకు చెందిన డీఎస్పీ సాజీమున్, ఇతర సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, కొన్ని పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు చేపట్టిన సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Pinakapani
Virasam
NIA

More Telugu News