ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
- ఎర్రిగట్టమ్మ గుట్ట వద్ద ప్రమాదం
- ఆటోను ఢీకొన్న డీసీఎం
- మరో నలుగురికి తీవ్ర గాయాలు
బాధితులను మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా గుర్తించారు. వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటో డ్రైవర్ (23)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.