Dr Gurumurthy: ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రి జైశంకర్ లకు లేఖ రాసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

YSRCP MP Dr Gurumurthy wrote Vice President of India and external affairs minister
  • బెలారస్ లో భారత విద్యార్థులున్నారన్న గురుమూర్తి
  • 1000 మందికి పైగా ఉన్నారని వెల్లడి
  • వారిలో 250 మంది తెలుగు విద్యార్థులున్నట్టు వివరణ
  • అందరినీ క్షేమంగా తీసుకురావాలని విజ్ఞప్తి

వైసీపీ నేత, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ లకు లేఖ రాశారు. బెలారస్ లో ఉన్న భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించాలని తన లేఖలో కోరారు. బెలారస్ లో ఉన్న భారత విద్యార్థుల భద్రతపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. 

దాదాపు వెయ్యి మందికి పైగా భారత విద్యార్థులు ప్రస్తుతం బెలారస్ లో ఉన్నారని ఎంపీ గురుమూర్తి వెల్లడించారు. వారిలో 250 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారని వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులను భద్రంగా స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News