Prabhas: ప్రభాస్ అలా మాట్లాడతాడని నేను ఊహించలేదు: భాగ్యశ్రీ

Radhe Shyam movie update
  • ఈ నెల 11న 'రాధేశ్యామ్' రిలీజ్ 
  • ప్రభాస్ కి తల్లిపాత్రలో భాగ్యశ్రీ
  • జోరందుకున్న ప్రమోషన్స్ 
  • ప్రభాస్ చాలా గ్రేట్ అంటున్న భాగ్యశ్రీ  
ప్రభాస్ తో కలిసి ఎవరు పనిచేసినా ఆయన మంచి మనసు గురించి చెబుతూనే ఉంటారు. సెట్లో ఉన్నవారందరినీ ఆయన చాలా ఆప్యాయంగా పలకరిస్తాడనీ, అందరినీ సమానంగా గౌరవిస్తాడని చెబుతుంటారు. ఇక తనతో ఉన్నవారందరికీ ఇంటి భోజనం రుచి చూపిస్తాడనీ .. ఆయనే స్వయంగా వడ్డిస్తాడని అంటారు. 

ఇక ఆయన సింప్లిసిటీ గురించి బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ చెప్పారు. 'రాధే శ్యామ్' సినిమాలో ఆమె ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగ్యశ్రీ మాట్లాడుతూ, ప్రభాస్ ను గురించి ప్రస్తావించారు. 

"ప్రభాస్ క్రేజ్ గురించి నేను విన్నాను .. కానీ ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. ఈ సినిమా సెట్లోనే ఆయనను చూశాను. ఎలా పలకరించాలా అని అనుకుంటూ ఉండగానే నా దగ్గరికి వచ్చేశారు. నా అభిమానినంటూ ఆయన చెప్పడంతో నేను షాక్ అయ్యాను. ఆయన అంత సింపుల్ గా ఉంటారనీ .. అంత చనువుగా మాట్లాడతాడని నేను ఊహించలేదు" అని చెప్పుకొచ్చారు.
Prabhas
Pooja Hegde
Bhagyasree
Radheshyam

More Telugu News