Mamata Banerjee: ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఎందుకింత జాప్యం చేస్తున్నారు?: కేంద్రంపై దీదీ ఆగ్రహం

Mamata Banarjee asks why Center takes so much time to evacuate Indian students from Ukraine
  • ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు
  • తరలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
  • జీవితాలు చాలా విలువైనవన్న మమతా బెనర్జీ
  • విద్యార్థుల సంఖ్యకు తగినన్ని విమానాలు పంపాలని స్పష్టీకరణ

రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్ లో ప్రస్తుతం కల్లోలభరిత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ కు చెందిన వేలమంది విద్యార్థులు ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తుండగా, యుద్ధం నడుమ వారిని స్వదేశానికి తరలించడం కేంద్ర ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. 

"ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థుల పరిస్థితి పట్ల తీవ్ర కలవరపాటు కలుగుతోంది. జీవితం చాలా విలువైనది. విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఎందుకు చాలా సమయం తీసుకుంటున్నారు? ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు? వెంటనే విద్యార్థుల సంఖ్యకు సరిపడినన్ని విమానాలను ఉక్రెయిన్ కు తరలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వీలైనంత త్వరగా విద్యార్థులందరినీ స్వదేశానికి తీసుకురండి" అంటూ మమత ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News