Revanth Reddy: కేసీఆర్ కు జాతీయస్థాయిలో ఉన్న ఇమేజ్ ఇదీ... రేవంత్ రెడ్డి వ్యంగ్యం

Revanth Reddy satires on KCR
  • ఢిల్లీలో కేసీఆర్ పర్యటన
  • కేజ్రీవాల్ ను కూడా కలుస్తారని టీఆర్ఎస్ చెప్పిందన్న రేవంత్
  • కానీ ఆ భేటీ జరగలేదని ఎద్దేవా  
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించేందుకు అరవింద్ కేజ్రీవాల్ ను కూడా కలుస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయని పేర్కొన్నారు. అయితే ఈ భేటీ జరగలేదని గుర్తుచేశారు. 

 "ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే... తెలంగాణ సీఎం అవినీతిపై తాము పోరాటం చేస్తామని ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి చెబుతున్నారు. కేసీఆర్ కు జాతీయస్థాయిలో ఉన్న ఇమేజ్ ఇదీ!" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, సోమ్ నాథ్ భారతి చేసిన ట్వీట్ ను కూడా రేవంత్ పంచుకున్నారు.
Revanth Reddy
KCR
Arvind Kejriwal
AAP
New Delhi
TRS
Congress

More Telugu News