Russia: 9,166 మంది రష్యా సైనికులను చంపేశాం.. రష్యా వైపు నష్టంపై జాబితా విడుదల చేసిన ఉక్రెయిన్

Ukraine Claims They Killed 9166 Russian Soldiers in War
  • 251 యుద్ధ ట్యాంకుల ధ్వంసం
  • 33 యుద్ధ విమానాలు, 37 హెలికాప్టర్ల కూల్చివేత
  • 105 ఫిరంగులు, 50 మిసైల్ లాంచర్ల ధ్వంసం
రష్యా దాడిలో ఉక్రెయిన్ కు తీవ్ర నష్టం జరుగుతున్నా.. ఉక్రెయిన్ కూడా అంతే స్థాయిలో విరుచుకుపడుతోంది. రష్యా సైన్యాన్ని, వారి యుద్ధ వాహనాలను ధ్వంసం చేస్తోంది. ఇప్పటిదాకా ఉక్రెయిన్ సైన్యం దాడిలో 9,166 మంది రష్యా సైనికులు చనిపోయారని, 251 రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. 

33 యుద్ధ విమానాలు, 37 హెలికాప్టర్లను కూల్చేశామని వెల్లడించింది. తమ దాడుల్లో రష్యాకు చెందిన 105 ఫిరంగులు, 939 సిబ్బందిని తరలించే వాహనాలు, 50 క్షిపణి లాంచర్లు, 2 పడవలు, 404 కార్లు, 60 ఇంధన ట్యాంకులు, 3 డ్రోన్లు, 18 యుద్ధ విమాన వినాశక మిసైల్ వ్యవస్థలను ధ్వంసం చేశామని ప్రకటన ఇచ్చింది.
Russia
Ukraine
War

More Telugu News