Nara Lokesh: మంగ‌ళ‌గిరిలో నారా లోకేశ్.. బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన టీడీపీ శ్రేణులు

nara lokesh visits amaravati villages
  • హైకోర్టు తీర్పుతో రాజ‌ధాని గ్రామాల్లో జోష్‌
  • నీలకంఠేశ్వర స్వామి సేవ‌లో నారా లోకేశ్
  • లోకేశ్ కు హార‌తి ఇచ్చి మ‌రీ గ్రామంలోకి ఆహ్వానం
  • పార్టీ కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌కూ వెళ్లిన టీడీపీ యువ‌నేత‌
ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూ ఏపీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన జోష్ రాజ‌ధాని ప‌రిధి గ్రామాల్లో చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ గురువారం మంగ‌ళ‌గిరి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాజ‌ధాని గ్రామ‌మైన నీరుకొండ‌కు వెళ్లారు.

రాజ‌ధాని రైతులు కొన‌సాగించిన ఉద్య‌మానికి ఆది నుంచి అండ‌గా నిలుస్తూ వ‌చ్చిన నారా లోకేశ్ ను చూడ‌గానే.. నీరుకొండ ప్ర‌జ‌లు ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. హార‌తి ఇచ్చి మ‌రీ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలోని భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేశ్ అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
Nara Lokesh
tdp
Amaravati
AP High Court
neerukonda

More Telugu News