Nagababu: కష్టాల్లో ఉన్న హెయిర్ డ్రెస్సర్ కు నాగబాబు ఆర్థిక ఆసరా

Nagababu helps financially to a hair dresser
  • జీతం అందక హెయిర్ డ్రెస్సర్ కు కష్టాలు
  • క్షీణించిన తల్లి ఆరోగ్యం
  • చలించిపోయిన నాగబాబు
కష్టాలపాలైన ఓ హెయిర్ డ్రెస్సర్ కు ప్రముఖ సినీ నటుడు నాగబాబు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తున్న ఉప్పలపు నాగశ్రీనుకు అతడు పనిచేసే సంస్థ నుంచి సరిగా జీతం అందడంలేదు. అదే సమయంలో అతడి తల్లి ఆరోగ్యం బాగా క్షీణించింది. దాంతో చేతిలో డబ్బు లేక, తల్లికి వైద్యం చేయించలేక నాగశ్రీను తీవ్ర వేదనకు గురయ్యాడు. అతడి పరిస్థితి తెలుసుకున్న నాగబాబు రూ.50 వేలు సాయం చేశారు. నాగశ్రీను కుటుంబానికి ఆ చెక్ ను తన నివాసంలో స్వయంగా అందజేశారు.
Nagababu
Help
Naga Srinu
Hair Dresser

More Telugu News