Pavankalyan: పవన్ కోసం మరో రీమేక్ కథపై త్రివిక్రమ్ కసరత్తు!

Pavan and Sai tej movie upcoming
  • భారీ విజయాన్ని సాధించిన 'భీమ్లా నాయక్'
  • సినిమా విజయంలో త్రివిక్రమ్ పాత్ర కీలకం 
  • మరో రీమేక్ కి రెడీ అవుతున్న పవన్ 
  • ఆ ప్రాజెక్టు బాధ్యత కూడా త్రివిక్రమ్ కే 
  • కీలక పాత్రలో సాయితేజ్

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. తాను చేసే ఇతర సినిమాల స్క్రిప్ట్ లపై త్రివిక్రమ్ సలహాలను .. సూచనలను పవన్ తీసుకుంటూ ఉంటారు. తాజాగా వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమా అంతా కూడా త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే కొనసాగింది. అందువల్లనే త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమా లేదని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ అన్నారు. 

ఇక ఇప్పుడు ఆయనకి పవన్ మరో బాధ్యతను అప్పగించినట్టుగా చెప్పుకుంటున్నారు. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో క్రితం ఏడాది వచ్చిన 'వినోదయ సితం' అక్కడ భారీ విజయాన్ని సాధించింది. సముద్రఖని దర్శకత్వంలోనే ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ ఆసక్తిని చూపుతున్నారట. 

ఈ సినిమా తెలుగు రీమేకులో మార్పులు .. చేర్పులు చేయవలసిన బాధ్యతను త్రివిక్రమ్ కి పవన్ అప్పగించాడని అంటున్నారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రను సాయితేజ్ చేయనున్నాడని చెబుతున్నారు. 'ఉగాది' రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారని చెప్పుకుంటున్నారు.

  • Loading...

More Telugu News