Major General: ఉక్రెయిన్ లో రష్యా సేనలకు గట్టి ఎదురుదెబ్బ... రష్యా సైనిక జనరల్ హతం!

A media outlet reportedly says Russian major general killed in Ukraine
  • ఉక్రెయిన్ భూభాగంగా రష్యా దాడులు
  • ప్రధాన నగరాలపై పట్టుకు ముమ్మర పోరాటం
  • మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్ స్కీ మరణించినట్టు కథనం
ఉక్రెయిన్ ప్రధాన నగరాలను చేజిక్కించుకునేందుకు గత వారం రోజులుగా తీవ్రంగా దాడులు చేస్తున్న రష్యా సేనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా సైనిక మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్ స్కీ ఉక్రెయిన్ దాడుల్లో మరణించినట్టు తూర్పు యూరప్ కు చెందిన అతిపెద్ద మీడియా సంస్థ నెక్ట్సా వెల్లడించింది. ఉక్రెయిన్ పై రష్యా సేనలు దండయాత్ర ప్రారంభించాక... జనరల్ స్థాయి అధికారి మరణించడం ఇదే ప్రథమం. 

ఇప్పటికే రష్యన్ సైనికులు ఉక్రెయిన్ లో తాము ఎవరిపై పోరాడాలో తెలియక తీవ్ర వేదనకు గురవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఉక్రెయిన్ బలగాలు మొక్కవోని పట్టుదలతో పోరాడుతూ తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మేజర్ జనరల్ ఉక్రెయిన్ దాడుల్లో మరణించడం రష్యా సైన్యం ఆత్మస్థైర్యాన్ని బలహీనపర్చుతుందనడంలో సందేహం లేదు.
Major General
Death
Russia
Ukraine

More Telugu News