హైకోర్టు తీర్పుతో ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: యనమల
మూడు రాజధానుల బిల్లు చెల్లదని తాము ముందు నుంచి చెపుతూనే ఉన్నామని అన్నారు. హైకోర్టు తీర్పుతో ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వ్యాఖ్యానించారు. హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని, పైకోర్టులో అప్పీల్ కు వెళ్లకూడదని సూచించారు. కోర్టు చెప్పిన విధంగా రాజధాని భూములను అభివృద్ధి చేసి రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు.