పుతిన్ ఒక యుద్ధ నేరస్థుడు: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్ర వ్యాఖ్యలు
- ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ యత్నాలు
- అవి కచ్చితంగా యుద్ధ నేరాలన్న జాన్సన్
- అమాయక ప్రజలపై బాంబులు వేస్తున్నారని మండిపాటు
రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం దర్యాప్తుకు అన్ని బ్రిటన్ చట్టసభల సభ్యులందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. "ఉక్రెయిన్ లో రష్యా ముమ్మాటికీ యుద్ధ నేరాలకు పాల్పడింది. పుతిన్ నేరాలను అందరూ చూశారు. అవి కచ్చితంగా యుద్ధ నేరాలే అవుతాయి. క్రిమినల్ న్యాయస్థానం ప్రాసిక్యూటర్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి ఉంటారు. బ్రిటన్ రాజకీయ పక్షాలన్నీ మద్దతిస్తాయని భావిస్తున్నాను" అని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.