Vikram: 'పొన్నియిన్ సెల్వన్' రిలీజ్ డేట్ ఖరారు!

Ponniyin Selvan release date confirmed
  • మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్ సెల్వన్'
  • చోళరాజుల కాలంలో నడిచే కథ
  • ఆసక్తిని పెంచుతున్న అప్ డేట్స్ 
  • సెప్టెంబర్ 30వ తేదీన విడుదల  
మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులంతా ఆ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేయడం మొదలుపెడతారు. ఎందుకంటే తెరపై ఆయన కథ చెప్పే తీరు .. పాత్రలను మలిచే విధానం కొత్తగా ఉంటుంది. ఎక్కడా కూడా అనవసరమైన ఖర్చు కనిపించదు. 

అలాంటి మణిరత్నం తాజా చిత్రంగా 'పొన్నియిన్ సెల్వన్'  సినిమా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించే ఈ సినిమాకి ఆయన కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇది చోళరాజుల కాలానికి సంబంధించిన కథ. ఆ కాలంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన .. దాని చుట్టూ అల్లుకున్న కథ ఇది. 

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా  విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్లను విడుదల చేశారు. ప్రధానమైన పాత్రల లుక్ చూస్తుంటేనే ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగిపోతోంది. విక్రమ్ .. కార్తి .. జయం రవి .. ఐశ్వర్య రాయ్ .. త్రిష ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Vikram
Karthi
Jayam Ravi
Ponniyin Selvan Movie

More Telugu News