Atchannaidu: ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చేందుకు అవకాశం ఉంది: అచ్చెన్నాయుడు

Atchannaidu attends Telugu Rythu Workshop in Hanuman Junction
  • హనుమాన్ జంక్షన్ లో తెలుగు రైతు వర్క్ షాప్
  • హాజరైన అచ్చెన్నాయుడు
  • టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రైతు విభాగం వర్క్ షాపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలు సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందిలే అనుకోవద్దని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలని సూచించారు. ఈసారి ఏపీలో టీడీపీ 160 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని అచ్చెన్నాయుడు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
Atchannaidu
Elections
Andhra Pradesh
TDP

More Telugu News