Gorantla Butchaiah Chowdary: వైఎస్ వివేకా హత్య కేసును సీఎం జగనే తప్పుదోవ పట్టిస్తున్నారు: గోరంట్ల బుచ్చయ్య

Gorantla Butchaiah Chowdary slams CM Jagan and Sajjala
  • వివేకా హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపణ 
  • సజ్జల అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • జగన్ సకుటుంబ సపరివార సమేత కుట్ర ఉందన్న బుచ్చయ్య 

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై స్పందించారు. ఈ కేసును తప్పుదోవ పట్టిస్తోంది సీఎం జగనే అని ఆరోపించారు. వివేకా కేసులో సాక్షులను బెదిరించే యత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎంను అరెస్టు చేసి ఈ వ్యవహారంలో రహస్యాలను సీబీఐ బయటికి లాగాలని కోరారు. వివేకా హత్య వెనుక జగన్ సకుటుంబ సపరివార సమేత కుట్ర ఉందని అన్నారు. 

అటు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా గోరంట్ల విమర్శలు చేశారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత టీడీపీ తరఫున పోటీ చేస్తుందని సజ్జల అనడం హేయమైన విషయం అని, అడ్డగోలుగా మాట్లాడడం సజ్జలకు తగదని హితవు పలికారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News