Akila Narayanan: అమెరికా సైన్యంలో న్యాయవాదిగా చేరిన తమిళ నటి అఖిల నారాయణన్

Tamil film actress Akila Narayanan joins US Army as lawyer
  • అమెరికా సైన్యానికి న్యాయ సలహా సేవలు
  • యుద్ధ శిక్షణ పూర్తి కావడంతో చేరిక
  • ఆమె ఆధ్వర్యంలో సంగీత పాఠశాల సైతం నిర్వహణ
భారత సంతతికి చెందిన తమిళ నటి అఖిల నారాయణన్ అమెరికా సాయుధ దళాల్లో చేరారు. న్యాయవాదిగా సేవలు అందించనున్నారు. అరుళ్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ సినిమా ‘కదంపరి’తో అఖిల చిత్రసీమలోకి గతేడాది ఎంట్రీ ఇచ్చారు. 

అమెరికా సాయుధ దళాల్లోకి చేరడానికి ముందు అఖిల కొన్ని నెలల పాటు అమెరికా సైన్యం ఆధ్వర్యంలో యుద్ధ శిక్షణ సైతం తీసుకున్నారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి కావడంతో ఆమె న్యాయవాదిగా చేరినట్టు సమాచారం. అమెరికా సైన్యానికి న్యాయ సలహా సేవలు అందించనున్నారు. 

అఖిల నారాయణన్ అమెరికాలోనే ఉంటున్నారు. నైటింగేల్ ఆఫ్ మ్యూజిక్ పేరుతో ఒక సంగీత పాఠశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల ద్వారా ఆమె స్వయంగా ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు.
Akila Narayanan
tamil actress
us army

More Telugu News