Archana: టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సీనియర్ నటి

Senior actress Archana starts second innings in tollywood
  • మళ్లీ వస్తున్న అర్చన
  • గతంలో నిరీక్షణ వంటి చిత్రాలతో అలరించిన నటి
  • చోర్ బజార్ చిత్రం ద్వారా రీఎంట్రీ
  • ఆకాష్ పూరి హీరోగా చోర్ బజార్
గతంలో నిరీక్షణ, లేడీస్ టైలర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటి అర్చన. గ్లామర్ కంటే అభినయానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి అవార్డుల నటిగా పేరు తెచ్చుకున్న అర్చన మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటిస్తున్న చోర్ బజార్ చిత్రం ద్వారా అర్చన తెలుగు చిత్రసీమలో సెకండ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. 

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో సీనియర్ నటీమణుల సెకండ్ ఇన్నింగ్స్ దిగ్విజయంగా సాగుతోంది. ఇప్పటికే నదియా వంటి తారలు కీలకపాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చోర్ బజార్ చిత్రంతో అర్చన కూడా మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలున్నాయి. చోర్ బజార్ చిత్రానికి జార్జి రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకుడు.  ఆకాష్ పూరి సరసన గెహనా సిప్పీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉంది.
Archana
Chor Bazar
Senior Actress
Tollywood

More Telugu News