YS Vivekananda Reddy: చంద్ర‌బాబు చేతిలో పావుగా వివేకా కుమార్తె: స‌జ్జ‌ల ఆరోప‌ణ‌

sajjala hits back vivekananda reddy daughters comments
  • మూడేళ్లుగా చంద్ర‌బాబు కుట్ర‌లు
  • ఆధారాలు లేకుండా సునీత ఆరోప‌ణ‌లు
  • వివేకా కేసులో వ‌రుస ప్ర‌క‌ట‌న‌ల‌పై స‌జ్జ‌ల మండిపాటు
దారుణ హ‌త్య‌కు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత‌, ఆమె భ‌ర్త రాజ‌శేఖ‌ర్ రెడ్డి కలిసి టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు చేతిలో పావులుగా మారార‌ని వైసీపీ నేత‌, ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం తాడేప‌ల్లి వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా స‌జ్జ‌ల ఒకింత ఘాటు విమ‌ర్శ‌లే చేశారు.

వివేకానంద‌రెడ్డి కేసు ద‌ర్యాప్తులో చంద్ర‌బాబు కుట్ర‌లు చేస్తున్నార‌ని, మూడేళ్లుగా చంద్ర‌బాబు అదే ప‌ని పెట్టుకున్నార‌ని స‌జ్జ‌ల ఆరోపించారు. చంద్రబాబు కుట్ర‌ల్లో భాగంగానే ఆయ‌న చేతిలో సునీత‌తో పాటు ఆమె భ‌ర్త కూడా పావులుగా మారిపోయార‌ని ఆయ‌న ఆరోపించారు. ఏమాత్రం ఆధారాలు లేకుండానే సునీత ఆరోప‌ణ‌లు చేస్తున్న వైన‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని కూడా స‌జ్జ‌ల ఆరోపించారు.
YS Vivekananda Reddy
Sajjala Ramakrishna Reddy
YSRCP
sunitha

More Telugu News