Harish Rao: తెలంగాణ బీజేపీలో రహస్య సమావేశాలు జరుగుతున్నాయట... బండి సంజయ్ ముందు ఇల్లు చక్కదిద్దుకో!: హరీశ్ రావు

Harish Rao fires on Telangana BJP Chief Bandi Sanjay
  • ఢిల్లీలో సంజయ్ కి మొట్టికాయలు పడ్డాయని ఎద్దేవా
  • మహిళలపై మాట్లాడే హక్కు సంజయ్ కు లేదని వ్యాఖ్య
  • తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ వెలగని దీపమేనని వ్యంగ్యం
  • టీఆర్ఎస్ మాత్రం దారిచూపే కాగడా అన్న మంత్రి హరీశ్  
టీఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. ముందు ఇల్లు చక్కదిద్దుకుని ఆపై మాట్లాడాలని బండి సంజయ్ కి హితవు పలికారు. "తెలంగాణ బీజేపీలో సీక్రెట్ మీటింగులు జరుగుతున్నాయట... బండి సంజయ్ ముందు వాటి సంగతేంటో చూసుకోవాలి. పైగా, బండి సంజయ్ ను ఢిల్లీ పిలిపించి పార్టీ హైకమాండ్ మొట్టికాయలు వేసినట్టు చెప్పుకుంటున్నారు" అని ఎద్దేవా చేశారు. 

హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలను సమర్థించిన బండి సంజయ్ కి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. అసోం సీఎం మహిళలను, మాతృమూర్తులను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణలో మీది ఎన్నటికీ వెలగని దీపం అంటూ హరీశ్ రావు బీజేపీని ఉద్దేశించి వ్యంగ్యం ప్రదర్శించారు. కానీ టీఆర్ఎస్ ఆరిపోయే దీపం కాదని, దారిచూపే కాగడా అని ఉద్ఘాటించారు. గవర్నర్ ప్రసంగంపై బీజేపీ నేతలకు మాట్లాడే అర్హత లేదని అన్నారు. మహిళలను అవమానించింది బీజేపీ నేతలు కాదా? అని నిలదీశారు.
Harish Rao
Bandi Sanjay
BJP
Telangana

More Telugu News