Travels Buses: ఒంగోలులో కావేరీ ట్రావెల్స్ కు చెందిన 8 బస్సుల దగ్ధం

Eight buses caught in fire at Ongole Wood Complex
  • ఉడ్ కాంప్లెక్స్ వద్ద భారీ అగ్నిప్రమాదం
  • కాలిపోయిన ట్రావెల్స్ బస్సులు
  • ఉడ్ కాంప్లెక్స్ లో మరో 20 బస్సులు
  • రూ.6 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగుంటుందని అంచనా
ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణ శివార్లలోని ఉడ్ కాంప్లెక్స్ వద్ద నిలిపి ఉంచిన 8 బస్సులు దగ్ధమయ్యాయి. ఇవన్నీ కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సులుగా భావిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకే కాక, పొరుగు రాష్ట్రాలకు కూడా ప్రయాణికులను తరలించే కావేరీ ట్రావెల్స్ బస్సులను గిరాకీ లేని సమయంలో  ఉడ్ కాంప్లెక్స్ వద్ద నిలిపి ఉంచుతారు. 

ఈ కాంప్లెక్స్ వద్ద చెలరేగిన మంటలు కొన్ని నిమిషాల్లోనే వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఉడ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అప్పటికే 8 బస్సులు కాలిపోయాయి. ఈ ప్రమాదంతో ఉడ్ కాంప్లెక్స్ పరిసరాల్లోని వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

కాగా, ఉడ్ కాంప్లెక్స్ వద్ద మరో 20 వరకు బస్సులు నిలిపి ఉన్నాయి. జరిగిన నష్టం రూ.6 కోట్ల వరకు ఉంటుందని ట్రావెల్స్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా డిమాండ్ లేకపోవడంతో బస్సులను ఇక్కడ నిలిపి ఉంచామని ట్రావెల్స్ కు చెందిన ఓ వ్యక్తి తెలిపారు.
Travels Buses
Fire Accident
Wood Complex
Ongole

More Telugu News