రష్యా యుద్ధ ట్యాంక్ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్న ఒక్కడు.. వీడియో వైరల్
- ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం
- ధైర్య సాహసాలు ప్రదర్శిస్తోన్న ఉక్రెయిన్ పౌరులు
- బఖ్‌మాచ్ వీధుల్లో యుద్ధ ట్యాంక్
- తన చేతులతో ట్యాంక్‌ను నెట్టడానికి యత్నించిన వ్యక్తి
మొదట ట్యాంక్ పైకి ఎక్కిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత కిందకు దిగి తన చేతులతో ట్యాంక్‌ను నెట్టడానికి యత్నించాడు. అయినా ట్యాంక్ ముందుకు వెళ్తుండడంతో ట్యాంకు ముందు మోకాళ్లపై నిలబడ్డాడు. చివరకు ఆ యుద్ధ ట్యాంకు ముందుకు వెళ్లలేకపోయింది. ఈ వీడియోను ఉక్రెయిన్ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.