Ukraine: ఉక్రెయిన్ అధ్య‌క్షుడు ఓ యోధుడు: స‌మంత పోస్ట్ వైర‌ల్‌

tollywood heroine samantha post on ukraine president
  • ఇన్‌స్టాలో స‌మంత పోస్ట్‌
  • తెగువ, ధైర్య సాహ‌సాలు క‌లిగిన వ్య‌క్తిగా జెలెన్‌స్కీని అభివ‌ర్ణించిన వైనం
  • అమీ జాక్స‌న్ కూడా ఆవేద‌నా భ‌రిత పోస్ట్‌
చిన్న దేశ‌మైన ఉక్రెయిన్‌పై భారీ సాయుధ సంప‌త్తి క‌లిగిన ర‌ష్యా దాడుల‌పై యావ‌త్తు ప్ర‌పంచం ఆగ్రహం వ్య‌క్తం చేస్తోంది. సినీ సెల‌బ్రిటీలు సైతం రష్యా సైనిక చర్యను ఖండించారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత కూడా ఇప్ప‌టికే ఓ సారి త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. తాజాగా సోమవారం నాడు మ‌రోమారు ఆమె ర‌ష్యా వైఖ‌రిని ఖండిస్తూ ఇస్టాగ్రామ్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆమె ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీని ఓ యోధుడిగా అభివ‌ర్ణించారు. 

‘యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర  కనుగొంది.. అతని తెగువ, ధైర్యసాహసాలే దానికి సాక్ష్యం’ అని ఉన్న న్యూస్‌ ఆర్టికల్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ని ఆమె షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌ హీరోయిన్‌ అమీ జాక్సన్‌ సైతం ఉక్రెయిన్‌, రష్యా ఉద్రిక్తతలపై రియాక్ట్ అయ్యారు. బాధిత దేశంలో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు సాయం అందించాలని ఆమె ప్రజలను అభ్యర్థించింది.
Ukraine
Russia
Volodymyr Zelenskyy
Samantha

More Telugu News