Vinod Kambli: మద్యం మత్తులో కారు నడిపి అరెస్ట్ అయిన టీమిండియా మాజీ క్రికెటర్

Police arrests Vinod Kambli after his rash driving with consuming alcohol
  • ముంబయిలో వినోద్ కాంబ్లీ అరెస్ట్
  • మద్యం సేవించి కారు నడిపిన కాంబ్లీ
  • అపార్ట్ మెంట్ గేటు ధ్వంసం
  • మరో కారును ఢీకొట్టిన వైనం
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో వేగంగా కారు నడిపి అపార్ట్ మెంట్ గేటును ధ్వంసం చేయడమే కాకుండా, మరో కారును ఢీకొట్టాడన్న ఆరోపణలపై కాంబ్లీని బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుతో ఢీకొట్టడమే కాకుండా, అపార్ట్ మెంట్ వాచ్ మన్ తోనూ, ఇతరులతోనూ కాంబ్లీ గొడవపడ్డాడు. 

కాగా, అరెస్ట్ అయిన కాసేపటికే కాంబ్లీ బెయిల్ పై విడుదలయ్యాడు. కాంబ్లీపై సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్), సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించడం), సెక్షన్ 427 (నష్టం కలిగించడం)ల కింద కేసు నమోదు చేశారు.
Vinod Kambli
Arrest
Drunk Driving
Alcohol
Police
Mumbai

More Telugu News