Andhra Pradesh: ఏపీలో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

- గత 24 గంటల్లో 15,654 కరోనా పరీక్షలు
- 200కి లోపే కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 2,850 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి కనిష్ఠస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 200కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. 15,654 కరోనా పరీక్షలు నిర్వహించగా, 136 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 26, తూర్పు గోదావరి జిల్లాలో 25, కృష్ణా జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్తకేసులేవీ నమోదు కాలేదు.
అదే సమయంలో 803 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,741 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,00,165 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,850 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,726కి పెరిగింది.
