ఆ 13 మంది చనిపోలేదట... ఉక్రెయిన్ యుద్ధంలో ఆసక్తికర పరిణామం!
- ఉక్రెయిన్ పై రష్యా దాడి
- స్నేక్ ఐలాండ్ వద్ద ప్రతిఘటించిన ఉక్రెయిన్ సైనికులు
- 13 మంది చనిపోయినట్టు వార్తలు
- హీరోలుగా అభివర్ణించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
- బతికే ఉన్నారని ఫొటోలు విడుదల చేసిన రష్యా
వారందరూ ఓ బస్సులో కూర్చుని ఉండడం, మంచినీరు, ఆహారం అందుకుంటున్నట్టు ఆ ఫొటోల్లో చూడొచ్చు. వారందరూ యుద్ధంలో చనిపోలేదని, తాము బందీలుగా పట్టుకున్నామని రష్యా చెబుతోంది. వారు స్వచ్ఛందంగానే లొంగిపోయారని రష్యా రక్షణ శాఖ తెలిపింది.
అంతేకాదు, యుద్ధ ఖైదీలుగా పట్టుకున్న ఆ సైనికులను తాము విడిచిపెడుతున్నామని, వారి కుటుంబాలను కలుసుకునేందుకు వీలుగా వారిని విడుదల చేస్తున్నామని వెల్లడించింది. అయితే, రష్యా ప్రకటన విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. పుతిన్ ఎత్తుగడలపై అవగాహన ఉన్నవారు రష్యా రక్షణ శాఖ ప్రకటనను నమ్మలేమని అభిప్రాయపడుతున్నారు.