Ishan Kishan: ఇషాన్ కిషన్ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు

Ishan Kishan hospitalised after being hit on head in 2nd T20I
  • శ్రీలకంతో టీ20 మ్యాచ్ లో ఘటన
  • సీటీ స్కాన్ చేసి, పరిశీలనలో ఉంచిన వైద్యులు
  • శ్రీలంక బ్యాట్స్ మ్యాన్ చండిమల్ వేలికి గాయం
భారత్-శ్రీలంక జట్ల మధ్య శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో రెండు అపశృతులు చోటు చేసుకున్నాయి. భారత క్రికెట్ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. తలకు గాయం కావడంతో అతడిని కంగ్రాలోని (హిమాచల్ ప్రదేశ్) ఒక ఆసుపత్రికి తరలించారు. అలాగే శ్రీలంక బ్యాట్స్ మ్యాన్ దినేష్ చండిమల్ ఫీల్డింగ్ చేస్తుండగా వేలికి గాయం అయింది. అతడిని కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

టీమిండియా క్రికెటర్ తలకు గాయం కావడంతో సీటీ స్కాన్ తీసి పరిశీలనలో ఉంచినట్టు డాక్టర్ సుభమ్ తెలిపారు. ఈ డాక్టర్ ను టీమ్ ఇండియాకు అటాచ్ చేశారు. అలాగే, వేలికి గాయంతో శ్రీలంక క్రికెటర్ కూడా ఆస్పత్రిలో చేరినట్టు ఆయన వెల్లడించారు. తలకు గాయం కావడంతో నేటి మూడో టీ20 మ్యాచ్ కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. 

Ishan Kishan
hospitalised
SRILANKA
DINESH CHANDIMAL

More Telugu News