YSRCP: వైసీపీ నాయకుల వేధింపులు భరించలేక చనిపోవాలనుకుంటున్నా.. కార్పొరేటర్ భర్త వీడియో వైరల్

YCP Corporator Husband Video Viral on social media
  • నా భార్యను కార్పొరేటర్‌గా గెలిపించినందుకు ఈ శిక్ష వేస్తున్నారు
  • నా కేబుల్ వ్యాపారాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు
  • మరో రెండు రోజుల్లో చనిపోతాను
  • నా చావుకు వారే బాధ్యులు అవుతారు
వైసీపీ నాయకుల వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని, తన వ్యాపారాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారంటూ విజయవాడ చిట్టినగర్‌కు చెందిన 48వ డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి భర్త అత్తులూరి పెదబాబు చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తానిప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, అందుకు వారే బాధ్యులు అవుతారని పేర్కొన్నారు. కేబుల్ ఫీల్డ్‌లో కొందరు వైసీపీ నేతలు, పెద్దలు తనను వేధిస్తున్నారని ఆ వీడియోలో ఆయన ఆరోపించారు. 

పార్టీ కోసం ఎంతో సేవ చేసిన తాను తన భార్యను కార్పొరేటర్‌గా నిలిపి, గెలిపించినందుకు కొందరు నాయకులు ఈ శిక్ష వేస్తున్నారని వాపోయారు. టీడీపీ నుంచి వచ్చిన వారి మాటలు విని సీనియర్ నాయకులను, కార్యకర్తలను మోసం చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో తాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, అదే జరిగితే తన చావుకు వారే బాధ్యులు అవుతారని హెచ్చరించారు. తనపాటు మరికొందరు ఆపరేటర్లు కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పార్టీలో మరో కార్యకర్తకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నానని పెదబాబు ఆ వీడియోలో కోరారు.
YSRCP
Vijayawada
Chitti Nagar

More Telugu News