రెండు విమానాల్లో 13 మంది తెలుగు విద్యార్థులు
- ఇప్పటికే 219 మందితో ముంబై బయలుదేరిన తొలి విమానం
- మరికాసేపట్లో మరో రెండు విమానాలు ఢిల్లీకి పయనం
- వీటిలో ఒకదానిలో 8 మంది, రెండో దానిలో 5 మంది తెలుగు విద్యార్థులు
ఈ రెండు విమానాల్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో 8 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విమానం టేకాఫ్ తర్వాత బయలుదేరే మరో విమానంలో మరో 5 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఈ రెండు విమానాలు కూడా నేరుగా ఢిల్లీకి చేరుకోనున్నాయి. తొలి విమానం రాత్రికే ఢిల్లీ చేరుకోనుండగా.., రెండో విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ చేరుకుంటుంది.