David Warner: పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే ముందు భావోద్వేగ పోస్ట్ చేసిన వార్నర్

David Warner Posts Emotional Message For Family Before Leaving For Pakistan
  • రెండు దశాబ్దాల తర్వాత పాక్ పర్యటనకు వెళ్తున్న ఆస్ట్రేలియా
  • ఆసీస్ పర్యటన తర్వాత ఐపీఎల్ కు వెళ్లనున్న వార్నర్
  • భార్యాపిల్లలకు దూరంగా ఉండటం కష్టమని వ్యాఖ్య
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వెళ్తోంది. పాక్ పర్యటనకు బయల్దేరే ముందు తన భార్యాపిల్లలను ఉద్దేశించి ఆసీస్ కీలక ఆటగాడు డేవిడ్ వార్నర్ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశాడు. పాకిస్థాన్ పర్యటనను ముగించుకున్న వెంటనే... వార్నర్ ఐపీఎల్ కు రానున్నాడు. 

ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా వార్నర్ స్పందిస్తూ... తన భార్య, కూతుళ్లకు గుడ్ బై చెప్పడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని అన్నాడు. గత కొన్ని నెలలుగా వారితో తాను ఎంతో విలువైన సమయాన్ని గడిపానని చెప్పాడు. కానీ ఇప్పుడు కొన్ని నెలలు మిమ్మల్ని వీడాల్సి ఉంటుందని, త్వరలోనే మనం మళ్లీ కలుసుకుందామని, అప్పటి వరకు చాలా మిస్ అవుతానని అన్నాడు. 

తన భార్య పిల్లలతో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశాడు. ఈ పోస్ట్ పై వార్నర్ భార్య స్పందించింది. నువ్వు గ్రౌండ్ లో చెలరేగిపోవడాన్ని మళ్లీ చూడాలనుకుంటున్నానని చెప్పింది. మేము కూడా నిన్ను మిస్ అవుతున్నాం అని తెలిపింది.
David Warner
Australia
Pakistan Tour
Emotional Message

More Telugu News