Russia: ఉక్రెయిన్ నుంచి నేడు ఏపీకి చేరుకోనున్న 22 మంది విద్యార్థులు: టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు వెల్లడి

22 AP Students to Reach AP in special flights from Ukraine
  • ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో భయం భయం
  • ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయ విద్యార్థులు
  • మూడు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, ముంబై చేరుకోనున్న తెలుగు విద్యార్థులు
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 మంది విద్యార్థులు నేడు రాష్ట్రానికి చేరుకోనున్నారు. బుకారెస్ట్ నుంచి మూడు ప్రత్యేక విమానాల్లో వీరంతా ఢిల్లీ, ముంబై చేరుకుంటారని రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఎండీ ఎ.బాబు తెలిపారు. 

ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి 13 మంది విద్యార్థులు చేరుకోనుండగా, మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ, సాయంత్రం 4 గంటలకు ముంబై చేరుకునే మరో రెండు విమానాల్లో 9 మంది కలిపి మొత్తంగా 22 మంది విద్యార్థులు చేరుకుంటారని, అక్కడి నుంచి స్వస్థలాలకు చేరుకుంటారని ఆయన తెలిపారు.
Russia
Ukraine
Andhra Pradesh
Students

More Telugu News