Hyderabad: మాదాపూర్‌లోని వ్యాపారి ఇంట్లో భారీ చోరీ.. రూ. 50 లక్షల విలువైన సొత్తు అపహరణ

About Rs 50 lakh worth cash and gold theft in madapur
  • కావూరి హిల్స్‌లో ఘటన
  •  గంటల వ్యవధిలోనే చోరీ
  • రూ. 20 లక్షల నగదు, రూ. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇక్కడి కావూరి హిల్స్ ఫేజ్-2లో వ్యాపారి వాసుదేవరెడ్డి నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి మొయినాబాద్‌ సమీపంలోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో తిరిగొచ్చారు. ఇంటి తాళం విరగ్గొట్టి ఉండడం చూసి హతాశులయ్యారు. 

వెంటనే లోపలికి వెళ్లి చూడగా కప్ బోర్డులో ఉంచిన రూ. 20 లక్షల నగదుతోపాటు కొంతమొత్తంలో అమెరికన్ డాలర్లు, రూ. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దాచి ఉంచిన సేఫ్ లాకర్ బాక్స్ మాయమైనట్టు గుర్తించారు. వెంటనే మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Madapur
Theft
Crime News

More Telugu News