Bheemla Nayak: ఓవర్సీస్ లో భీమ్లా నాయక్ కలెక్షన్లు ఇవిగో!

Bheemla Nayak collections details
  • ప్రపంచవ్యాప్తంగా రిలీజైన భీమ్లా నాయక్
  • ఓవర్సీస్ లో ఒకరోజు ముందే ప్రివ్యూలు
  • అమెరికాలో ఒక్కరోజులో రూ.6.53 కోట్లు
  • పవన్ నట విశ్వరూపానికి ఫ్యాన్స్ బ్రహ్మరథం
ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ భీమ్లా నాయక్ ఓవర్సీస్ కలెక్షన్లను వెల్లడించారు. పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించిన భీమ్లా నాయక్ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజైంది. ఓవర్సీస్ లో ముందే ప్రీమియర్స్ ప్రదర్శించారు. కాగా, ఈ చిత్రం అమెరికాలో గురువారం నాడు రూ.6.53 కోట్లు వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. యూకేలో రూ.87.81 లక్షలు, ఐర్లాండ్ లో రూ.6.44 లక్షలు వసూలు చేసినట్టు వివరించారు. కాగా, భీమ్లా నాయక్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పవన్ కెరీర్ లోనే పవర్ఫుల్ మూవీ అంటూ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు.
Bheemla Nayak
Collections
USA
UK
Ireland
Tollywood

More Telugu News