Corona Virus: తెలంగాణ‌లో కొత్తగా క‌రోనా మ‌ర‌ణాల్లేవ్‌.. తాజా కేసుల వివ‌రాలివే!

telangana daily corona cases update
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 35,064 కరోనా పరీక్షలు నిర్వహించగా, 287 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 85 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20 చొప్పున కేసులు న‌మోద‌య్యాయి.

అదే సమయంలో 569 మంది కరోనా నుంచి కోలుకోగా, మ‌ర‌ణాలేవీ సంభ‌వించ‌లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,383 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,80,462 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,810 మంది చికిత్స పొందుతున్నారు.

Corona Virus
telangana

More Telugu News