Raghu Rama Krishna Raju: లాలా భీమ్లా.. అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు: 'భీమ్లానాయక్' ప్రదర్శనలపై రఘురామకృష్ణరాజు
- పవన్ కల్యాణ్-రానా కీలకపాత్రల్లో 'భీమ్లానాయక్'
- అడవి పులి గొడవపడి.. ఒడిసిపట్టు దంచికొట్టు అంటూ రఘురామ ట్వీట్
- ఏపీ ప్రభుత్వ నోటీసును పోస్ట్ చేసిన ఎంపీ
పవన్ కల్యాణ్-రానా కీలకపాత్రల్లో నటించిన 'భీమ్లానాయక్' ప్రదర్శనల విషయంలో ఏపీ సర్కారు కఠినంగా వ్యవహరిస్తుండడంపై వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ఏపీ సర్కారు థియేటర్లకు ఇచ్చిన నోటీసులను ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. థియేటర్ల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఈ విషయాలను రఘురామ కృష్ణరాజు ప్రస్తావించారు.
'లాలా భీమ్లా.. అడవి పులి గొడవపడి.. ఒడిసిపట్టు దంచికొట్టు.. కత్తిపట్టు అదరగొట్టు.. పవన్ కల్యాణ్ గారికి, దగ్గుబాటి రానాకు శుభాకాంక్షలు.. భారీ విజయం సాధించినందుకు ఆ సినిమా మొత్తానికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను. అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు' అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
రఘురామ కృష్ణరాజు పోస్ట్ చేసిన ప్రభుత్వ నోటీసు..