UK: ఉక్రెయిన్ కోసం యుద్ధరంగంలోకి దిగుతున్న బాక్సింగ్ లెజెండ్లు.. దేశం కోసం ఆయుధాలు పడతామని వ్యాఖ్య!

Ukraine Boxing champions taking up arms to fignt against Russia
  • మాతృ దేశం కోసం ఆయుధం పడతానన్న మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ విటాలీ
  • 2014 నుంచి కీవ్ మేయర్ గా వ్యవహరిస్తున్న విటాలీ
  • దేశం కోసం యుద్ధం చేయడం మినహా మరో మార్గం లేదని వ్యాఖ్య
రష్యా చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ దాదాపు ఒంటరి అయిపోయింది. సైనిక పరంగా ఆ దేశం ఒంటరిగానే రష్యాను ఎదుర్కొంటోంది. శక్తిమేరకు ప్రతిఘటిస్తోంది. మరోవైపు దేశం కోసం కదనరంగంలోకి దిగాలనుకునే అందరికీ ఆయుధాలను అందిస్తామని దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. అంతేకాదు సైనిక దుస్తులు ధరించి ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ఆయనిచ్చిన పిలుపుతో వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు తమ దేశం కోసం పోరాడేందుకు ముందుకొస్తున్నారు.
 
ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖ బాక్సర్లు విటాలీ క్లిట్స్ చ్కో, వ్లాదిమిర్ క్లిట్స్ చ్కో మాతృదేశం కోసం యుద్ధంలో పాల్గొంటామని ప్రకటించారు. వీరిద్దరూ సోదరులు కావడం గమనార్హం. వీరిలో విటాలీ మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ కావడం విశేషం. విటాలీని అభిమానులు ముద్దుగా 'ఉక్కు పిడికిలి' అని పిలుచుకుంటారు.

వ్లాదిమిర్ కూడా గొప్ప బాక్సర్ గా హాల్ ఆఫ్ ఫేమ్ లో ఒకరిగా ఉన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు 2014 నుంచి విటాలీ మేయర్ గా ఉన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, యుద్ధ రంగంలోకి దిగడం మినహా తనకు మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. తన దేశం కోసం యుద్ద రంగంలోకి దిగుతానని 50 ఏళ్ల విటాలీ తెలిపారు. కీవ్ ను రక్షించుకోవడానికి ప్రజలు సైనికుల్లా పోరాడుతారని చెప్పారు.
UK
Russia
War
Boxer
Vitali Klitschko
Wladimir Klitschko

More Telugu News