Priyanka Chopra: ఉక్రెయిన్ కు మద్దతుగా ప్రియాంక చోప్రా పోస్ట్

Priyanka Chopra says Russian invasion in Ukraine is terrifying
  • భయానక పరిస్థితులు నెలకొన్నాయి
  • అమాయక ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు
  • వారు మనలాంటి వారేనన్న ప్రియాంక

రష్యా దాడులతో భీతిల్లుతున్న ఉక్రెయిన్ ప్రజలకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మద్దతు పలికింది. ఉక్రెయిన్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తెలియజేసే ఒక వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ పేజీపై పోస్ట్ చేసింది. ఉక్రెయిన్ ప్రజలు ప్రాణ భయంతో సబ్ వే స్టేషన్లు, బంకర్లలో తలదాచుకోవడం అందులో కనిపిస్తుంది. (వీడియో లింక్)

‘‘ఉక్రెయిన్ లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. అమాయక ప్రజలు తమతోపాటు, తమ వారి ప్రాణాల గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో ఈ తరహా విపత్కర పరిస్థితులను ఊహించలేము. ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందనకు దారితీసే పరిస్థితి ఇది.

యుద్ధం జరుగుతున్న చోట అమాయక ప్రజలున్నారు. వారు మీలాంటి వారు, నాలాంటి వారే. ఉక్రెయిన్ ప్రజలకు ఎలా సాయపడాలో తెలియజేసే మరింత సమాచారాన్ని తెలియజేసే నా బయో లింక్ ఇదే’’ అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్ ప్రజలకు సాయం చేయాలనుకునే వారు యునిసెఫ్ కు విరాళం ఇవ్వాలని సూచించారు.

  • Loading...

More Telugu News