Ravindra Jadeja: వికెట్ తీసి ‘పుష్పరాజ్’లా మారిపోయిన రవీంద్ర జడేజా

Jadeja Celebrates Wicket With Allu Arjun Movie
  • శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ లో జడేజా విన్యాసం
  • 10వ ఓవర్లో చండిమల్ అవుట్
  • అనంతరం తగ్గేదేలే అన్న సంకేతం
పుష్ప సినిమాలోని ‘పుష్పరాజ్’ క్యారెక్టర్ మానియా ఇంకా చల్లారలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పుష్ప హావభావాలను అనుకరించే ప్రయత్నం చేయడాన్ని సామాజిక మాధ్యమాలపై చూస్తూనే ఉన్నాం. తాజాగా శీలంకతో మొదటి టీ20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా మరోసారి పుష్ప రాజ్ క్యారెక్టర్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు.

గురువారం లక్నోలోని ఏక్ నా స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 200 లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక జట్టును బౌలింగ్ తో టీమిండియా కట్డడి చేసింది. రెండు నెలల విరామం తర్వాత జట్టులోకి తిరిగి అడుగుపెట్టిన జడేజా బ్యాట్ తో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ కీలకమైన ఒక వికెట్ తీసి జట్టు విజయంలో పాలు పంచుకున్నాడు.

10వ ఓవర్లో శ్రీలంక బ్యాట్స్ మ్యాన్ దినేష్ చండిమల్ ను అవుట్ చేశాడు. అంతే.. పట్టరాని ఆనందం వచ్చేసింది. పుష్పరాజ్ మాదిరిగా గడ్డం కింద చేయి పెట్టి తగ్గేదేలే అన్న సంకేతం ఇచ్చాడు. అనంతరం సంతోషంతో రోహిత్ శర్మను హత్తుకున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ తిరిగేస్తోంది. మాజీ క్రికెటర్ మురళి కార్తీక్ స్పందిస్తూ రవీంద్ర పుష్పగా కామెంట్ చేశాడు. జడేజా గతంలోనూ శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ చేసిన మాదిరే డ్యాన్స్ తో అలరించడం గమనార్హం.
Ravindra Jadeja
pushparaj
Sri Lanka match

More Telugu News